మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథాకాన్ని త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు సీఎం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది.దానిపై కసరత్తులు చేస్తూనే తాజాగా మరో గొప్ప పథకంపై దృష్టి పెట్టారని సమాచారం అందుతుంది.
తల్లికి వందనం పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారట ఏపీ సీఎం. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థినికి రూ.15 వేలు ఇవ్వబోతున్నారట. త్వరలోనే ఈ డబ్బు విద్యార్ధి తల్లుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన మంత్రి నిమ్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.