ఏపీ పెన్షన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్ …

Big Alert for AP Pension Beneficiaries...

ఏపీ ప్రభుత్వం పెన్షన లబ్దిదారుల్లో అనర్హుల గుర్తింపు పైన కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది అనేక కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత వీరికి అందుతున్నపెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. అయితే, కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ ధృవపత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. నకిలీ ధృవపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది.

ఏపీలో పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సెర్ప్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60 వేల మందికి తిరిగి వైకల్య నిర్దారణ పరీక్షలు చేయాలని తేల్చారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదులు చేసారు. దీంతో,వారికి నోటీసులు జారీ చేసారు.

AP Government to Disburse Pensions in Village and Ward Secretariat Offices

దివ్యాంగులు కొందరు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందటం పైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు.దివ్యాంగ సర్టిఫికెట్ల జారీలోనూ పలు ప్రాంతాల్లో వేల రూపాయాలు తీసుకొని జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వున్నాయి.ఇదే అంశం పైన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం నకిలీ ధృవపత్రాలతోపెన్షన్లు అందుకుంటున్న వారి పైన ఫోకస్ చేయటంతో వారి పెన్షన్లుకు కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply