రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటున్న యువతీ…

"A young woman who says that Raj Tarun doesn't matter."

రాజ్ తరుణ్ చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ సంయుక్త అనే యువతి ఓ వీడియో రిలీజ్ చేసింది.ఇప్పటికే లావణ్య వివాదంలో చిక్కుకున్న రాజ్తరుణ్ అనేక విమర్శలు పాలవుతున్నారు. ఇప్పుడు మరో యువతి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ వీడియో లో ఆమె మొహాన్ని పూర్తిగా స్కార్ఫ్తో కప్పేసిన యువతి కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ… ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్న హీరో ఇవన్నీ చేశాడంటే నమ్మకం కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఎక్కడా రాజ్ తరుణ్ పేరు చెప్పకుండానే మేటర్ వీక్ అని ప్రచారం చేస్తోంది. తన ఫ్రెండ్తో డేటింగ్లో ఉన్నాడని ఓ ముద్దు ముచ్చట ఏమీ లేదని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ చూటడానికి బాగానే ఉంటాడు కానీ ఆయన వద్ద మేటరే లేదని చెప్పింది. త్వరలోనే తన ఫ్రెండ్ యూఎస్ నుంచి రానుందని పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన్ని మీ ముందు నిలబెడతానంటూ సంచల వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటికే 30 దాటినా పెళ్లి చేసుకోలేదని… 40 వచ్చినా కూడా పెళ్లి ఊసే ఎత్తడని చెప్పుకొచ్చింది. మేటర్ లేదనే విషయం ఆయనకీ తెలుసు అంది. తను డేటింగ్లో ఉండే అమ్మాయి.. ఎవరెవరినో పిలుచుకున్నా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉంటారని తెలిపింది.ఇదంతా కూడా కొత్తగా రాబోయే సినిమా “భలే ఉన్నాడే”కు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా చేసిందే. తన చుట్టూ అల్లుకున్న వివాదాలను కూడా ఈసారి సినిమా ప్రమోషన్కు వాడేయాలని చూస్తున్నారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న ‘భలే ఉన్నాడే’ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రమోషన్లో భాగంగా ఇలా సంయుక్త పేరుతో వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మాట్లాడిన యువతి ఏం చెప్పారంటే…” లాస్ట్ వన్మంత్ నుంచి ఓ హీరో గురించి చాలా విషయాలు వింటున్నాం న్యూస్లో. నిజం చెప్పాలంటే అసలు ఆయన దగ్గర మేటరే లేదండీ. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఓ వన్ ఇయర్ నుంచి నా ఫ్రెండ్ ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నారండీ. వాళ్లిద్దరు కలిసి ఉండటం ఏమో కానీ, ఆ పిల్ల రోజూ నాకు ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ ఒకే దగ్గర పడుకుంటారంటే… ఈయన మాత్రం పక్కకు తిరిగి పడుకుంటాడ. ఈ అమ్మాయి దగ్గరకు వెళ్లినా సరే దూరం వెళ్లిపోతుంటాడంట. ఓ ముద్దు లేదూ ముచ్చటా లేదని ఏడుస్తూనే ఉంటుంది.

Cases filed against actor Raj Tarun after he rams his car into a wall |  Telugu Movie News - Times of India

అదేదో ఆడియో కాల్లో విన్నానండీ నేను… ఆ అమ్మాయి వాడిని తీసుకురా వీడిని తీసుకురా అని చెప్తా ఉంటుంది. ఈ అబ్బాయి పక్కనే ఉన్నా ఆ అమ్మాయి వాళ్లను పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండీ. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానన్నాడు… ఇప్పుడు 30 వచ్చాయి అయినా పెళ్లి చేసుకోలేదు. మరో పదేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోడు. అలా ఉన్నాడే ఇలా ఉన్నాడే అని సినిమాలు బాగానే చేసుకుంటాడు. మనిషి చూడటానికి బాగానే ఉంటాడు. ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో. ఆగస్టు 19న మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. విత్ ప్రూఫ్స్తో మీకు అన్నీ చూపించి మాట్లాడతాను అని చెప్పింది.

రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వస్తున్న చిత్రం కోసం ఇలా కొత్తగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

 

Leave a Reply