బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈటీవీలో చేస్తున్నఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్ గా మంచి ఫామ్ లోకి వచ్చారు.ఇతర టీవీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రధానంగా సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉన్న లవ్ ట్రాక్ మాత్రం సూపర్ హిట్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర ప్రేక్షకులంతా వీరి జంటకు ఫిదా అయిపోయారు. వీరుఇద్దరు వివాహం చేసుకుంటారని అనుకున్నప్పటికీ తమ మధ్య అటువంటిదేమీ లేదని, కేవలం స్క్రీన్ పై మాత్రం ప్రేమ జంటగా నటిస్తుంటామని, బయట అటువంటిదేమీ లేదని రష్మి స్పష్టంగా చెప్పేసింది.
ప్రస్తుతానికి సినిమాల్లో బిజీ అయిన సుధీర్ ఇప్పుడిప్పుడే మళ్లీ బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్నారు. రష్మీ కూడా గతంలో సినిమాల్లో నటించింది. అంతం, రాణిగారి బంగ్లా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులు కూడా లక్షల సంఖ్యలో ఆమెను ఆదరిస్తున్నారు. మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మీ కూడా బాగా ట్రోలవుతుంటుంది. కొందరు రష్మీని కావాలనే టార్గెట్ చేస్తారని అంటారు. ఆన్ లైన్ లో అభిమానులతో తరుచుగా మాట్లాడుతుంటుంది.సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా వుండే రష్మీ కి ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్నలు వేశారు. చెంప దెబ్బ ఇవ్వాలంటే ఎవరికిస్తారు?.. ముద్దు పెట్టాలంటే ఎవరికిస్తారు?.. వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికిస్తారని అడిగాడు. దీనికి రష్మీ తనను టీజ్ చేస్తుంటాడు కాబట్టి హైపర్ ఆదికి వార్నింగ్ ఇస్తానని, యాంకర్ ప్రదీప్ కు ముద్దు ఇస్తానని, సుడిగాలి సుధీర్ కు వార్నింగ్ ఇస్తానని చెప్పింది. దీంతో ఆన్ లైన్ చాట్ లో పాల్గొన్న అభిమానులంతా షాక్ తిన్నారు. సుధీర్ కు ముద్దు ఇస్తుందేమోనని అనుకున్నామని, కానీ ప్రదీప్ కు అనేసరికి వారిమధ్య స్క్రీన్ మీదేకానీ, స్క్రీన్ బయట ఎటువంటి రిలేషన్ లేదని దీన్నిబట్టి అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.