ఆవర్తనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గుర్తించింది . వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం తెలిపింది…
శుక్రవారం నాటి దక్షిణ అంతర్గత కర్నాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక సరిహద్దు తెలంగాణ పరిసరాల్లో సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉన్నది. శుక్రవారం నాటి ద్రోణి ఉత్తర అంతర్గత కర్నాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఇప్పుడు తెలంగాణకు ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్భాగం కర్ణాటక మీదుగా నున్న ఉపరిత ఆవర్తనం నుండి కేరళ, తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలిసికోండి
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
శనివారం, ఆదివారం, సోమవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ :-
శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశంఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.