భారతదేశంలో చిట్ట చివరి రైల్వేస్టేషన్ ఏదో మీకు తెలుసా…?

Last railway stations in India. India's northernmost railway station is Baramulla in Jammu and Kashmir, and the westernmost is Naliya near ...

భారతీయ రైల్వే రోజురోజుకు అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్కీం కింద విమానాశ్రయాల తరహాలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చే సంవత్సరం చివరలోకానీ, తర్వాత సంవత్సరం కానీ పట్టాలెక్కబోతోంది. సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ పట్టాలపై వేగంగా పరుగులు తీస్తున్నాయి.

అనేక ఘనతలను సొంతం చేసుకున్న భారతీయ రైల్వే నెట్ వర్క్ లక్ష కిలోమీటర్లు కు పైగా ఉంది. ప్రతిరోజు 13వేల రైళ్ల ల్లో కోటిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భారత్ లోని ప్రతి రైల్వేస్టేషన్ కు ఒక కథ ఉంటుంది. వాటివెనకాల ఎన్నో వాస్తవిక జీవితాలకు సంబంధించిన చరిత్ర ఉంటుంది. ఈ కోవలోకి చెందినదే మన దేశంలోని చివరి రైల్వేస్టేషన్ సింగాబాద్ స్టేషన్. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని మాల్దా జిల్లా హబీబ్ పూర్ ప్రాంతం లో ఇది ఉంది. దీన్ని ఇండియా చివరి స్టేషన్ గా భావిస్తారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. దీన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించారు.

భారతదేశానికి, బంగ్లాదేశ్ కు మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడంలో ఈ స్టేషన్ ది కీలక పాత్ర. జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటివారు ఢాకా వెళ్లాలంటే ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు సాగడంలేదు. ప్రయాణికుల కోసం రైలు ఆగడంలేదు కానీ గూడ్స్ రైళ్లను మాత్రం ఆపుతున్నారు.సింగాబాద్ నుంచి బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాలకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎగుమతులు, దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రయాణికుల రైళ్లకు సంబంధించిన సిబ్బంది ఎవరూ ఇక్కడ విధులు నిర్వహించనప్పటికీ గూడ్స్ రైళ్లకు సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రం ఉంటారు. సిగ్నల్ ఇంజనీర్ తోపాటు స్టేషన్ సిబ్బంది పలువురు ఉంటారు. అయితే సింగాబాద్ లో ప్రయాణికుల కోసం రైళ్లను ఆపాలంటూ కొన్నాళ్లుగా ఇక్కడి ప్రజలు రైల్వేను కోరుతున్నారు.

Leave a Reply