బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీలీల…???

"Srileela, a popular Tollywood actress, poses confidently as she announces her entry into Bollywood. She is dressed in a stylish outfit, with a backdrop hinting at the glamour of the Indian film industry."

ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పొజీషన్ లో ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పూజా హెగ్డే డౌన్ అయిపోయాక నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి శ్రీలీల గట్టి పోటీదారి గా మారింది.ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో ‘గుంటూరు కారం’ చేసిన శ్రీలీల,దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.దీనితో పాటు నితిన్‌తో ‘రాబిన్ హుడ్’లోనూ నటిస్తోంది. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజతోనూ సినిమాకు ఓకే చెప్పింది. ఇలా మంచి ఊపులో సాగుతున్న శ్రీలీల కెరీర్.. బాలీవుడ్‌ వైపు కూడా టర్న్ తీసుకుంటోంది. ఆల్రెడీ హిందీలో ‘దిలేర్’ అనే ఓ చిన్న సినిమా చేస్తోంది శ్రీలీల. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో ఓ పెద్ద ఆఫరే ఆమెను వరించినట్లు సమాచారం. బాలీవుడ్ అప్ కమింగ్ స్టార్లలో ఒకడైన సిద్దార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల నటించబోతోందట.

బల్వీందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నాడు అని సమాచారం. ఈ చిత్రానికి ‘మిట్టి’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. శ్రీలీలకు ఇందులో ఓ మంచి పాత్రే దక్కిందట. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫామ్ వున్నా హీరోయిన్లలో ఒకరైన సంయుక్త సైతం బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ సైతం ‘తెరి’ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది.వీరి బాట లోనే శ్రీలీల సైతం హిందీ సినిమా వైపు చూస్తోంది. ఐతే సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో క్లిక్ అయిన సందర్భాలు తక్కువే. అయినా సరే.. దేశమంతా పాపులర్ అయిన హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తే ఎవరు మాత్రం కాదంటారు. మరి బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్లు తన అప్పీయరెన్స్, యాక్టింగ్‌ను శ్రీలీల మార్చుకుని అక్కడా తనదైన మార్క్ వేస్తుందో లేదో చూడాలి.

Leave a Reply