ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్..

Government employees in Andhra Pradesh reviewing the 2024 transfer guidelines issued by the state.

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరతకు ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం… ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. 31వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీలపై గత కొన్ని రోజులుగా దృష్టిపెట్టిన ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై చర్చించింది. ప్రజాసంబంధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు తాజాగా ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు జారీచేసింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను కూడా రిలీవ్ చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో APకి 122 మంది తెలంగాణ ఉద్యోగులను కేటాయించారు. అయితే వారిని తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వీరంతా వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. అలాగే రిలీవ్ అవుతున్న ఉద్యోగులు అందరూ.. తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది.

మరోవైపు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి రిలీవ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపైనా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు విభజన నాటి నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు ఏపీజేఏసీ కార్యదర్శి వలిశెట్టి దామోదర్, అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply