ప్రభుత్వ భవనంలోకి అడుగుపెట్టాలంటేనే భయపడుతున్న ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ..!

క్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఏమైంది. ఆ ప్రభుత్వ భవనంలోకి అడుగుపెట్టాలంటేనే మహిళా ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఎందుకు భయపడుతున్న . గత ఎమ్మెల్యే నాలుగేళ్లు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు.

కానీ 8 నెలలు గడుస్తున్న కొత్త ఎమ్మెల్యేకు మాత్రం అక్కడి వెళ్లాలంటేనే అయిష్టత చూపిస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయా?. ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళటం లేదు.

ప్రజలు, పరిపాలన సౌకర్యార్థం గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్మించింది. ఎమ్మెల్యే నివాసం తో పాటు, ఎమ్మెల్యే కార్యకలాపాల నిర్వహణ కోసం అధికారిక భవనాలను కొత్తగా నిర్మించారు. ఆయా నియోజకవర్గ ప్రజలు క్యాంపు కార్యాలయంకు వెళ్లి సమస్యల చెప్పుకోవడం, విజ్ఞప్తుల కోసం ఈ ఆఫీసులు ఉపయోగపడతాయన్న లక్ష్యంతో వీటిని నిర్మాణం చేపట్టారు.

MLA Parnika Reddy is afraid to enter the government building..!
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం వారి వారి నియోజకవర్గాల్లోని క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి మాత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్ళాను అంటున్నారట. ప్రైమ్ లోకేషన్ లో క్యాంపు కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడికి అస్సలు వెళ్ళడం లేదు. గెలిచి దాదాపు 8నెలలు గడుస్తున్నా అధికారిక నివాసానికి, కార్యాలయానికి ఎందుకు వెళ్ళడం లేదంటూ ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

వాస్తు దోషమే ప్రధాన కారణమా..?

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు కోటి రూపాయల వ్యయంతో గత ప్రభుత్వం క్యాంపు కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2020 జులై నుంచి నాటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించారు. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి చెందిన పర్ణికా రెడ్డి ఘనవిజయం సాధించారు . దీంతో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి క్యాంపు కార్యాలయం వినియోగంలో లేకుండా పోయింది. తాజా ఎమ్మెల్యే అందులోకి వస్తారని అందరూ భావించారు. కానీ ఆమె మేనమామ శివకుమార్ రెడ్డి నివాసంలోనే క్యాంపు కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం అందులో అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారట. గెలిచి 8నెలలు గడుస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళడం లేదని చర్చలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రధాన రోడ్డు మార్గం పక్కన ఉన్నందున ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళడం లేదని ఎమ్మెల్యే వర్గం నేతలు చెబుతున్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెడతారని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లాలోకి వెళ్ళకపోవడానికి వివిధ రకాల కారణాలు చెబుతున్నా.. అసలు విషయం వాస్తు ఏ నని వాదనలు వినిపిస్తున్నాయి.

గత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అదే ఇంట్లో ఉన్నాడు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయాడని అందుకు వాస్తు దోషమే కారణమని హస్తం క్యాడర్ చర్చించుకుంటోంది. అందుకే ఆమె అటు వైపునకు వెళ్ళడం లేదని తెలుస్తోంది. కారణాలు ఏవైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిరుపయోగంగా ఉంచడం స్థానికంగా చర్చ నడుస్తోంది. వెళ్ళడం ఇష్టం లేకపోతే ప్రజా ధనం వృథా కాకుండా ఇతర శాఖలకైన భవనాలు ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది.

Leave a Reply