సంక్రాంతి పండుగకు పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అయిన విషయం మన అందరికి తెలుసు తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఎన్బికె 109వ చిత్రంగా డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. జనవరి 12వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా తొలి రోజే బ్లాక్ బస్టర్ గా టాక్ వినిపిస్తుంది.యూఎస్ఏలో మిలియన్ డాలర్ మార్క్ సాధించిన బాలయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 56 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక ఇదే సమయంలో తాజాగా బాలయ్య బాబు సాధించిన మరొక విజయం పైన చర్చ జరుగుతుంది. అమెరికాలో వరుసగా నాలుగు సినిమాలు వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ఈ రికార్డ్ బాలయ్య కే సొంతం డాకు మహారాజ్ అమెరికాలో బాక్సాఫీస్ వద్ద 6. 50 కోట్లు , ఒక మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుంది. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాల తో పాటు ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా నాలుగవ సినిమాగా మిలియన్ డాలర్ మార్కును వచ్చింది. ఇప్పటివరకు ఇట్లాంటి ఘనత వహించిన టాలీవుడ్ హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో జోష్ మొదలైంది.
64ఏళ్ళ వయసులోనూ అదరగొట్టిన బాలయ్య బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాగా, 64 ఏళ్ల వయసులో కూడా బాలయ్య బాబు సాధిస్తున్న రికార్డుల పరంపర బాలయ్య ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తుంది. సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య తన అద్భుతమైన నటనతో ఇరగదీసాడు. ఇక థియేటర్లలో సందడి చేస్తూ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు. నటించిన ప్రతీ సినిమాలోనూ అభిమానులను ఆకట్టుకునే తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ మేనియా పెద్ద ఎత్తున కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ మేనియా ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులను ఆకట్టుకునే మార్క్ చూపిస్తున్న బాలయ్య సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ల పైన సూర్యదేవర నాగ వంశీ