మే 18వ తేదీన కేతువు సూర్యుడి రాశిగా చెప్పే సింహరాశిలోకి సంచారం చేస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి చాలా విశేషమైన లాభాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నీడ గ్రహంగా, కీడు గ్రహంగా భావించే కేతు గ్రహం అన్ని రాశుల వారి పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కేతు గ్రహం సానుకూల ఫలితాలను కూడా లభిస్తాయి.
మీనరాశి : కేతు గ్రహం సింహరాశి లోకి ప్రవేశించటం కారణంగా మీన రాశి వారికి సానుకూల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మీన రాశి వారు లాభపడతారు. ఈ సమయంలో ఊహించని విధంగా వీరికి డబ్బు వచ్చి పడుతుంది. ఎటువంటి పనులనైనా చక్కబెట్టగలిగే సామర్థ్యం ధైర్యం మీన రాశి వారికి లభిస్తాయి.
మిధున రాశి :మే 18వ తేదీ నుంచి మిధున రాశి వారికి శుభ ఫలితాలు వింటారు. మే నెల నుంచి వీరి జీవితం చాలా బాగుంటుంది. మిధున రాశి వారు అనుకున్న పనులన్నీ వేగంగా జరిగిపోతాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో వీరు చాలా ధైర్యవంతంగా ఉండి అన్ని పనులను చక్కబెడతారు.
వృశ్చిక రాశి: కేతు గ్రహ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక ఈ సమయంలో తీరుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ సమయం. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. కీర్తి ప్రతిష్టల విషయంలో సంతోషం ఉంటుంది.
ధనుస్సు రాశి: కేతు గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.