మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందువిడుదలఅయిందీ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం వచ్చింది. కథ, కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తెలిపారు. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై అభిప్రాయం తెలిపారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు తెలిపారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 89.6 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే రూ.51 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 2వ రోజు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దాంతో రెండో రోజైన శనివారం రూ.21.6 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
మూడవ రోజైన ఆదివారం (జనవరి 12) న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.17 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 89.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే మూడో రోజు మాత్రం 65 శాతం కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సినిమాకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే..గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లను మూవీ టీమ్ పెంచి చూపించిందనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.