నిరంతరం శనివేటాడుతుందా.. ఇంట్లో ఈ ఒక్కటి చేయండి!

Are you always on Saturday.. Do this at home!

 

రాతి ఉప్పు అనేది సహజంగా లభించే ఉప్పు. ఇది సాధారణ టేబుల్ సాల్ట్ కంటే వేరేగా ఉంటుంది. దీనిని “పింక్ సాల్ట్” లేదా “హిమాలయన్ పింక్ సాల్ట్” అని కూడా అంటారు, ఎందుకంటే ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది. రాతి ఉప్పు  కేవలం వంటల్లోనే కాకుండా, ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి అని నమ్ముతారు. వీటిలో కొన్ని వాస్తవమైనవి కాగా, కొన్ని నమ్మకాలు , సంప్రదాయాలకు సంబంధించినవి. వాటి గురించి చూదాం .

వాస్తవ ప్రయోజనాలు:

రాతి ఉప్పుతో ప్రయోజనాలు:

రాతి ఉప్పు దీపాలు  గాలిలోని తేమను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తాయని అంటారు. ఇవి గాలిలోని కాలుష్య కారకాలను , అలెర్జీ కారకాలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాతి ఉప్పు తేమను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రాతి ఉప్పును కొన్ని ప్రదేశాలలో చల్లడం వల్ల కీటకాలు రాకుండా నివారించవచ్చు. కాబట్టి, దీన్ని గదుల్లో ఉంచడం వల్ల గదుల్లోని తేమను తగ్గించవచ్చు.

 

 

నమ్మకాలు – సంప్రదాయాలకు సంబంధించిన ప్రయోజనాలు:

నెగటివ్ ఎనర్జీని తొలగించడం: వాస్తు శాస్త్రం , ఇతర సంప్రదాయాల ప్రకారం, రాతి ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంట్లో రాతి ఉప్పును ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం , శ్రేయస్సు కలుగుతాయని అంటారు.

వాస్తు దోష నివారణకు: వాస్తు దోషాలు ఉన్నాయని భావించే గదుల్లో రాతి ఉప్పును ఒక గిన్నెలో ఉంచడం వల్ల దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ముఖ్యంగా టాయిలెట్ మరియు బాత్రూమ్‌లలో వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. కాబట్టి, ఆ ప్రదేశాల్లో రాతి ఉప్పును ఉంచడం మంచిది. నేల శుభ్రం చేయడానికి: ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాతి ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడుచుకోవడం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది మరియు ప్రతికూల శక్తులను దూరంచేస్తుంది.

దిష్టి తగలకుండా: చిన్న పిల్లలకు లేదా ఇతరులకు దిష్టి తగిలితే, రాతి ఉప్పుతో దిష్టి తీయడం ఒక సాధారణ ఆచారం. రాతి ఉప్పును చేతితో మూడుసార్లు దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ తిప్పి నీటిలో వేయడం లేదా బయట పడేయడం చేస్తారు. ఆర్థిక సమస్యలకు: రాతి ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బులు పెట్టే చోట ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని కొందరు నమ్మఖం.

స్నానపు నీటిలో రాతి ఉప్పు: స్నానపు నీటిలో రాతి ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతాయని నమ్ముతారు. ఎలా ఉపయోగించాలి: గాలిని శుద్ధి చేయడానికి, గదికి అందాన్ని ఇవ్వడానికి రాతి ఉప్పు దీపాలను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రాతి ఉప్పు వేసి ఇంట్లో ఒక మూలన ఉంచవచ్చు. రాతి ఉప్పును నీటిలో కలిపి ఆ నీటితో ఇల్లు తుడవవచ్చు. స్నానపు నీటిలో కొద్దిగా రాతి ఉప్పు వేసుకుని స్నానం చేయవచ్చు. జాగ్రత్తలు: రాతి ఉప్పును నేరుగా చర్మంపై రుద్దకూడదు. పిల్లలు , పెంపుడు జంతువులకు రాతి ఉప్పు అందుబాటులో లేకుండా ఉంచాలి.

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ నమ్మకాలు , సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని గుడ్డిగా నమ్మకుండా, వివేకంతో వ్యవహరించడం ముఖ్యం. దీనిని oneindia ధృవీకరించలేదు.

Leave a Reply