గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్ – అనుష్క?

Prabhas - Anushka going to tell good news?

 

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ చాలా  బిజీ బిజీగా ఉన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో రాజాసాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో నటిస్తున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూ.500 కోట్ల బడ్జెట్ తో ఫౌజీ చేస్తున్నారు. ఈ రెండు కాకుండా కొత్త సంవత్సరంలో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ప్రారంభం కాబోతోంది. దాదాపు రూ.వెయ్యి కోట్లపైనే బడ్జెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు సందీప్ చాలామందిని పరిశీలిస్తున్నారు.

అభిమానులు మాత్రం బలంగా కోరుకుంటున్నారు వైరలవుతున్న వార్త ప్రకారం స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా అనుష్క పేరును సందీప్ ఫైనల్ చేసినట్లు తెలిపారు. ఇద్దరి జంట బాగుంటుందని, వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. దీంతో అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లైంది. వాస్తవానికి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చేవి. అటువంటిదేమీ లేదని, కేవలం తాము స్నేహితులమేనని ఇద్దరూ స్పష్టత ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని బలంగా తెలుపుతున్నారు.

 

Prabhas - Anushka going to tell good news?

 

మల్టీప్లెక్స్ లను బతికిస్తున్నాడు ఇటీవలే ఏఐతో వీరిద్దరి పెళ్లి ఫొటోలను క్రియేట్ చేయడంతోపాటు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు సృష్టించారు. ఓ మంచి ముహూర్తం చూసి స్పిరిట్ ప్రారంభించాలనే యోచనలో సందీప్ ఉన్నట్లు వార్తలు వింటున్నాము. కొరియాకు చెందిన నటుణ్ని విలన్ గా తీసుకోబోతున్నారు. అతన్ని తీసుకుంటే ప్రభాస్ కు బలమైన ప్రత్యర్థి దొరికినట్లవుతుందని, సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. స్పిరిట్ తర్వాత సలార్ 2, కల్కి2 చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా తన నుంచి కచ్చితంగా విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ వేసుకుంటున్నారు.

Leave a Reply