ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగా చూస్తున్నాం. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి ఉంది. అయితే ఓ హీరోయిన్ ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు వనిత విజయ్ కుమార్.ఈమె తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రసిద్ధ నటి మాత్రమే కాకుండా, ఒక వ్యాపారవేత్త, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, మరియు యూట్యూబర్ కూడా. ఆమె తన తండ్రి విజయ్ కుమార్ వారసురాలిగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి, తనదైన ముద్ర వేసింది.ఆమె తన సినీ జీవితాన్ని తమిళ చిత్రం ‘చంద్రలేఖ’తో మొదలుపెట్టింది, తరువాత తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో నటించింది. ‘దేవి’ వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
మరి నాలుగో పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఈ అమ్మడు వైవాహిక జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తుందో లేదో చూడాలి.అయితే అమ్మడు సినిమాలతో కన్నా వ్యక్తిగత జీవితం ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు.వనిత విజయ్ కుమార్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. వనిత విజయ్ కుమార్ మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో మొదటి భర్తకు విడాకులిచ్చారామె. కొద్ది రోజులకే ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. రెండో పెళ్లిని కూడా ఆమె ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. మూడో పెళ్లి ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు వనిత విజయ్ కుమార్ తెలిపింది.