ప్రతి ఒక్కరూ తమ జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని తెగ ఆశపడుతూవుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ గ్రహం ఏ రాశిలో సంచారం చేస్తుంది?. ఏ గ్రహం శుభస్థానంలో సంచారం చేస్తుంది? ఏది అశుభ స్థానంలో ఉంది? వంటి అనేక వివరాలను తెలుసుకోవడానికి ఆశపడుతూవుంటారు.
రాహువు సంచారం : ఈ రోజుమంచి జరుగుతుందా.. చెడు జరిగే అవకాశం ఉందా అన్నది కూడా చెక్ తెలుసుకుంటారు. అయితే నీడ గ్రహాలుగా కీడు గ్రహాలుగా భావించే రాహువు కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి 18 నెలల సమయాన్ని తీసుకుంటాయి. సహజంగా తిరోగమన సంచారం చేసే రాహువు 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి మారుతున్నాడు.
మీనరాశి నుంచి రాహువు మే నెలలో కుంభరాశిలోకి తన సంచారాన్ని సాగిస్తాడు. ఇక కుంభరాశిలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న రాహువు సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి మేష రాశి వారికి రాహువు సంచారం కారణంగా ఆర్థిక సమస్యలు తీరుతాయి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. మేష రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుంది. మేషరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. చాలా రోజులుగా ఖాళీగా ఉన్నవారు ఉద్యోగాలలో చేరుతారు. ఆర్థికంగా ఈ సమయంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది.ఇది వీరికి మంచి సమయం. మకర రాశి రాహు సంచారం కారణంగా మకర రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
8 ఏళ్ల తర్వాత రాహువు కుంభరాశిలోనే సంచరించడం కుంభ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలకు కారణమవుతుంది. ఇది అన్ని విధాలుగా కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. కుంభరాశి రాహువు సంచారం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు . ఆర్థికంగా కుటుంబ పరంగా ఈ సమయంలో కుంభ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.