హీరో అండ్ కమెడియన్ సుధాకర్గు రించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు లేరు.ఆ మాటకొస్తే తమిళ సినీ ప్రేమికులు కూడా సుధాకర్ నటన ని ఎంజాయ్ చేసిన వాళ్లే అంటే
ఫుల్ గా ఉన్నారు కాదు. తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా చేసాడు. ఇక తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి.తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని గుర్తింఫు పొందారు ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ట్రెండింగ్ లో ఉన్నాయి.
సుధాకర్ తన కొడుకు బెన్నీ తో కలిసి తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతు పవన్ కళ్యాణ్ నన్ను అన్నయ్య అని పిలిచేవాడు. అలాగే నా వైఫ్ ని వదిన అని పిలుస్తూ మాతో ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు. అదే విధంగా నాకు కూడా పవన్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి అంటే ఎంత ప్రేమ ఉంటుందో పవన్ అంటే కూడా అంతే ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే డిప్యూటీ సిఎం అయిన తర్వాత పవన్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని దాంతో పవన్ చాలా ఆనందపడ్డాడని తెలిపాడు ఇప్పుడు ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ లో జోష్ ని తెస్తున్నాయి.
ఇక పవన్, సుధాకర్ లు గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి లో కలిసి నటించారు. ఆ మూడు కూడా ఘన విజయం సాధించాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అందరకి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 600 సినిమాల దాకా చేసాడు. కొన్ని సినిమాలని కూడా నిర్మించాడు.