‘గేమ్‌ఛేంజర్’ టికెట్ ధరల పెంపునకు ఓకే చేపిన్న…..రేవంత్‌రె‌డ్డి ?

'Gamechanger' OK to hike ticket prices.....Revanth Reddy?

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఈనెల 10వ తేదీన వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో చెర్రీ రెండు పాత్రలు పోషించారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాని నిర్మించారు. భారీ చిత్రాలను అలవోకగా రూపొందించే అగ్ర దర్శకుడు శంకర్ దీన్ని తీశారు. 9వ తేదీ రాత్రి గేమ్ ఛేంజర్ కు ప్రీమియర్ షోలు వేయనున్నారు. టికెట్ ధరల పెంపు ఏపీలో ఉండగా, తెలంగాణలో లేదనే విషయం మన అందరికి తెలుసు. అంజలి, కియారా అద్వానీ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించిన ఈ సినిమాకు తమన్ స్వరాలందించారు. ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేసిన సినిమా ఇది.

 

 

తెలంగాణలో సినిమాకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు రద్దు చేశారు. వీటితోపాటు టికెట్ ధరల పెంపు కూడా ఉండదని తేల్చిచెప్పారు. ఉలిక్కిపడ్డ సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు.అల్లు అర్జున్ సినిమా పుష్ప2 విడుదల సందర్భంగా వేసిన బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుండటం, వారిని సినీ పరిశ్రమకు చెందినవారెవరూ పరామర్శించకపోవడం, సహాయం అందించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రహోదగ్రులయ్యారు.

తాజాగా సీఎం రేవంత్ గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు, ప్రీమియర్ షోలకు అనుమతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఆయన ఖరాఖండిగా తేల్చేసినట్లు తెలుస్తోంది. అయితే జరగరాని సంఘటన ఏదైనా జరిగితే సంబంధిత థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తానని రేవంత్ చెప్పారు. టికెట్ ధరల పెంపు ఎంత ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ప్రారంభమవుతున్నాయి.పోలీసులు అందించే సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలులేదని ఈ చిత్ర నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజుకు గట్టిగా చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్త వైరలవుతోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply