మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు విభేదాలున్నాయనే సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఉప్పునిప్పుగా ఉన్న విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భగ్గుమన్నాయి. ఆ తర్వాత కూడా శాంతి చెందాయి. పుష్ప2 విడుదల కావడం, సంధ్య థియేటర్ లో తొక్కిసలాట, మహిళ మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోపగించారు, తర్వాత బెయిల్ పై అల్లు అర్జున్ బయటకు రావడం, చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లడం… ఇలా వరుసగా పరిణామాలన్నీ జరిగాయి. అయితే పవన్ కల్యాణ్ ను కలవలేదు. కలవడానికి పవన్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఇందులో బాధ్యతా రాహిత్యమే కనిపిస్తోందని, మానవత్వం లోపించినట్లు కనపడుతోందని పవన్ తెలిపారు.
ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలను మైత్రీ మూవీస్ మరోసారి ఎగదోస్తోంది. అయితే హీరో, దర్శకుడు అంగీకరించకుండా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత ముందుగాకానీ, లేదంటే కొంత ఆలస్యంగా కానీ సన్నివేశాలను యాడ్ చేస్తే ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇచ్చినట్లు ఉండేదికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు నిర్మాత మైత్రీ మూవీస్ ప్రత్యర్థి దిల్ రాజు. దీంతోపాటు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలవుతున్నాయి. కొత్తగా 20 నిముషాల సన్నివేశాలను పుష్ప2కు యాడ్ చేస్తున్నారు. జనవరి 11వ తేదీ నుంచి థియేటర్లలో వీటిని ప్రదర్శించబోతున్నారు. ఒకరకంగా కొత్త సినిమాల కలెక్షన్లను దెబ్బతీసి పుష్ప2 కలెక్షన్లను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఇలా చేస్తున్నారు. ఇది వారి వ్యాపారం.
జనవరి 1 నుంచి యాడ్ చేస్తే బాగుండేది గేమ్ ఛేంజర్ విడుదలవుతోంది కాబట్టి కావాలనే పుష్ప2 సన్నివేశాలను జోడించి విడుదల చేస్తున్నారని, విభేదాలను పెంచుకోవడమేకానీ తగ్గించుకునే ఉద్దేశం అల్లు అర్జున్ కు లేదని దీనిద్వారా స్పష్టమవుతోందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఒకవేళ సన్నివేశాలను సినిమాకు యాడ్ చేయాలనుకుంటే జనవరి 1వ తేదీ నుంచి యాడ్ చేసుకొని ఉంటే మరింత కలెక్షన్లు పెరిగేవని, సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినా పాత సినిమాకు ప్రేక్షకులు రారని, కొత్త సినిమాలవైపే మొగ్గుచూపుతారని వ్యాఖ్యానిస్తున్నారు.