ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా రాణించడానికి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న పాత్రలతో తమ కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పుడు హీరోయిన్స్ గా మారి తమ నటనతో స్టార్స్ గా ఎదిగారు.మరికొంతమంది పదుల సంఖ్యలో ఆడిషన్స్ ఇచ్చి ఎట్టకేలకు హీరోయిన్స్ గా మారారు. వీరితోపాటు ఇప్పుడు ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్స్ గానూ చాలా మంది రాణిస్తున్నారు. అయితే ఒక్కసారి హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అలా కాదని కొంతమంది తమ చేతులారా తమ సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లైన హీరోతో ఎఫైర్ నడిపింది. దాంతో కెరీర్ క్లోజ్ అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేక పూర్తిగా సినీ ఇండస్ట్రీ కి దూరం అయ్యింది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఆమె ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ నిఖిత. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో క్యూట్ గా ఉండే నిఖిత 2002లో హాయ్ అనే సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో వచ్చిన వేణు తొట్టెంపూడితో నటించిన కళ్యాణ రాముడు తో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. లారెన్స్ కు జోడీగా నటించింది. ఈ మూవీలో కాస్త హాట్ గా కనిపించింది నిఖిత. ఈ అమ్మడు కన్నడ భాషలోనూ పలు సినిమాలు చేసింది. అక్కడ కన్నడ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకంటున్న సమయంలో నటుడు దర్శన్ తో ప్రేమలో పడింది ఈ చిన్నది. అయితే అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా కూడా ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకు తిరిగారు. ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు.
అయితే ఈ ఇద్దరి విషయం దర్శన్ భార్యకు తెలియడంతో.. ఆమె దర్శన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చ అయ్యింది. దాంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ నిఖిత పై మూడేళ్లు నిషేధం విధించింది. అయితే నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితకు పెద్దగా అవకాశాలు రాలేదు.దాంతో 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది.