2025 జ్యోతిష్యశాస్త్రం: 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి మాసంలోని రెండో రోజైన గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురు చంద్రుడి ప్రభావంతో నవ పంచమ యోగం ఏర్పడనుంది. మిధునం, సింహ రాశులతో సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…కొన్ని రాశుల వారికి గురు గ్రహం ప్రత్యేక అనుగ్రహం లభించనుంది.
మేష రాశి ఫలితాలు :
మేష రాశి వారు ఈరోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, మీ కోరిక జరుగుతుంది.ఇది మీ సంపదను పెంచుతుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఇది మీ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. అతిథుల రాక కారణంగా ఈరోజు మీ డబ్బు ఖర్చు పెరగొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనిని సీనియర్ అధికారి దయతో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మరోవైపు కుటుంబానికి చెందిన చిన్న పిల్లలతో సాయంత్రం సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు :
ఈ రాశి వారు ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండదు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. అలా అయితే, ఈరోజే వారిని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ వ్యాపారం లేదా పిల్లల సమస్యకు సంబంధించి ఒక యాత్రకు ప్లాన్ చేస్తారు. ఈరోజు కొన్ని సమస్యలకు మీరు పరిష్కారం పొందుతారు.
మిధున రాశి వారి ఫలితాలు :
మిధున రాశి వ్యాపారులు ఈరోజు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఇవి ఆచరణ సాధ్యమైతే మీకు సంతోషం కలుగుతుంది. మరోవైపు మీ స్నేహితులలో ఒకరిచే మోసం చేయబడొచ్చు. ఇది మీ మనస్సును బాధపెడుతుంది. ఈరోజు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు దీన్ని చేయకపోతే, మీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడొచ్చు. మీ సాయంత్రం సమయాన్ని తల్లిదండ్రులకు సేవ చేస్తారు. విద్యార్థులు ఈరోజు ఎవరితోనూ వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు :
కర్కాటక రాశి వారు ఈరోజు సాంఘిక, మతపరమైన పనుల కోసం ఎక్కువ ఖర్చులు చేయాల్సి రావొచ్చు. మరోవైపు మీ కుటుంబ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. లేకుంటే అవి మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తాయి. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆస్తిలో ఏదైనా కొనడం లేదా అమ్మడం గురించి ఆందోళన చెందుతుంటే, ఈరోజు మీకు పరిష్కారం లభిస్తుంది. పని చేసే వ్యక్తులకు ఈరోజు బాధ్యతలు ఇవ్వొచ్చు. ఈ కారణంగా మీరు కొద్దిగా ఆందోళన చెందుతారు.
సింహ రాశి వారి ఫలితాలు :
ఈ రాశి వారు ఈరోజు విజ్ఞత, విచక్షణతో వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ఒత్తిడిని మీపై ఆధిపత్యం చెలాయించకూడదు. మీరు ఈరోజు ఏదైనా ఆస్తితో వ్యవహరించబోతున్నట్లయితే, అందుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా తనిఖీ చేయాలి. ఉద్యోగ రంగంలో వస్తున్న అడ్డంకులు ఈరోజు తొలగుతాయి. దీని వల్ల ఉపాధి కోసం ప్రయత్నించే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఏదైనా వివాదం ఉంటే, ఈరోజు మీరు దానిని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు.
కన్య రాశి వారి ఫలితాలు :
ఈ రాశి వారికి ఈరోజు కోర్టు కేసులు ఏవైనా చాలా కాలంగా నడుస్తున్నట్లయితే, అది ఈరోజుతో ముగుస్తుంది. దీనివల్ల మీకు వివాదాలు కూడా తొలగిపోతాయి. సోషల్ వర్క్ పట్ల మీ ఆసక్తి కూడా ఈరోజు పెరుగుతుంది. దీని కోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఈరోజు మీ పనులన్నింటినీ ఇతరులకు వదిలివేయకూడదు. ఇలా చేస్తే భారీ నష్టం వాటిల్లుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి వారి ఫలితాలు :
ఈ రాశి వారిలో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగస్తులకు బాధ్యతలు పని భారం పెరగొచ్చు. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో వివాహ చర్చలకు సంబంధించి మీ తండ్రి సలహా అవసరం. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వొచ్చు. మీరు ఈ సాయంత్రం కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొనొచ్చు. మీరు ఎవరికైనా చాలా కాలం నుండి డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, మీరు దానిని ఈరోజే తిరిగి పొందిచ్చు. ఇది మీ సంపదను పెంచుతుంది.
వృశ్చిక రాశి ఫలితాలు :
ఈ రాశి వారు ఈరోజు ఏ పనైనా విశ్వాసంతో చేస్తే, దాని వల్ల ఖచ్చితంగా మీకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పని చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషిస్తారు. ఈరోజు మీరు బయట తినడం, త్రాగడం మానుకోవాలి. లేకుంటే ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సాయంత్రం మీరు కొద్ది దూరం ప్రయాణం చేయొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు :
ధనస్సు రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇది మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. ఆధ్యాత్మికత, జ్ఞాన మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీరు పూజలు మొదలైన వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు. మరోవైపు ఈరోజు పెరుగుతున్న అనవసర ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఈరోజు మీరు వ్యాపారం కోసం కొన్ని కొత్త ప్రణాళికలు కూడా వేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీ సోదరులు, సోదరీమణుల నుండి ఏదైనా వ్యతిరేకతను ఎదుర్కొంటే, అది కూడా ఈరోజుతో ముగుస్తుంది.
మకర రాశి వారి ఫలితాలు :
మకర రాశి వారు ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, వాహనాన్ని ముందే చెక్ చేసుకోవాలి. లేదంటే వాహనంలో లోపం కారణంగా మీ ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని శుభ కార్యాలలో పాల్గొనొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు :
ఈ రాశ వారికి ఈరోజు పాత తగాదాలు, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు పెరుగుతున్న ఖర్చులను కూడా నియంత్రించగలుగుతారు. ఈరోజు మీ కార్యాలయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీ గురించి మీ పైఅధికారులకు కూడా కబుర్లు చెప్పొచ్చు. మీరు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే, దాని నుండి చాలా ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనొచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఈరోజు విద్యార్థులు తమ ఉన్నత చదువులకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మీ తండ్రి సలహా అవసరం పడుతుంది.
మీన రాశి వారి ఫలితాలు :
ఈ రాశి వారు ఈరోజు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవ్వడంతో మీరు చాలా ఆనందపడతారు. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వివాహం చేసుకునే వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను చర్చించొచ్చు.ఈరోజు ఏదైనా పనిలో పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో మీరు దాని నుండి పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు.